Mon Jan 13 2025 03:08:49 GMT+0000 (Coordinated Universal Time)
డేగ కళ్లతో సభపై పోలీసులు
అమరావతి రైతుల బహిరంగ సభ నేడు తిరుపతిలో జరగనుంది. వేలాది మంది హాజరయ్యేందుకు ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు.
అమరావతి రైతుల బహిరంగ సభ నేడు తిరుపతిలో జరగనుంది. వేలాది మంది హాజరయ్యేందుకు ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు. ప్రధానంగా తిరుపతి శివార్లలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు వైసీపీ మినహాయించి అన్ని రాజకీయ పార్టీల నేతలను అమరావతి జేఏసీ ఆహ్వానించింది. చంద్రబాబుతో పాటు బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా హాజరయ్యే అవకాశముంది.
అల్లర్లు జరిగే....
ఈ నేపథ్యంలో తిరుపతి సభలో అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదికలు అందాయి. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. సభకు వచ్చే వారితో పాటు సభ ప్రాంగణం బయట ఎలాంటి అరాచక శక్తులు జొరబడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అల్లర్లు జరిపి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని అధికార వైసీపీ ఆరోపిస్తుండగా, వైసీపీయే అల్లర్లు చేసి విధ్వంసాన్ని సృష్టించాలనుకుంటుందని టీడీపీ అంటోంది.
Next Story