Thu Dec 19 2024 13:15:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కు బొప్పరాజు వార్నింగ్
తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు
తాము దీర్ఘకాలంగా అడుగుతున్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. లేకుంటే ఈ నెల 22వ తేదీన ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన అంశాలపై నిర్ణయం ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
తక్షణమే చేయాలని...
ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయీలను తక్షణం చెల్లించాలని ఆయన కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వెంటనే క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇవ్వాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా పెంచాలని ఆయన కోరారు.
Next Story