Sat Jan 11 2025 18:43:45 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతికి ఇక సొబగులు... రాజధాని రెడీ అవుతుంది బాసూ
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి రెడీ అవుతుంది. ఈరోజు రాజధాని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి రెడీ అవుతుంది. ఈరోజు రాజధాని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నాలుగు నెలల్లో సీఆర్డీఏ శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నాలుగు నెలల్లోనే ఏడంతస్థుల అత్యాధునిక సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అతి పెద్ద భవనం రాజధాని అమరావతిలో నాలుగు నెలల్లో సాకారం కానుంది. ఇక అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా జనవరి నెల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బ్లూ ప్రింట్ ను కూడా సిద్ధం చేసింది. డిసెంబరు నెలలో ఈ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది.
36 కోట్లతో జంగిల్ క్లియరెన్స్...
ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసింది. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని పట్టించుకోకపోవడంతో పాటు మూడు రాజధానుల ప్రతిపాదన కూడా తెచ్చింది. ఒక్క తట్టెడు మట్ట కూడా గత ఐదేళ్లలో వేయలేదు. దీంతో అమరావతి ప్రాంతమంతా పిచ్చిచెట్లు మొలిచాయి. దానికి మళ్లీ పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు కూటమి ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ తర్వాత కొంత అమరావతికి పూర్వ వైభవం వచ్చినట్లు కనపడుతుందని అక్కడి రైతులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు వరసగా ఇక నిర్మాణ పనులు ప్రారంభమైతే భవన నిర్మాణ కార్మికులకు కూడా పనిదొరుకుతుందని భావిస్తున్నారు.
మూడేళ్లలో కొన్ని పనులు...
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణ పనులు సాగనునున్నాయి. నవ నగరాలు అక్కడ ఏర్పాటు కానున్నాయి. మూడేళ్లలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు. ఎలాగైనా మూడేళ్లలో పనులు పూర్తి చేసి రాజధానికి రూపురేఖలు రావాలని కోరుతున్నారు. అప్పుడు రైతులకు ఇవ్వగా ప్రభుత్వం వద్ద భూమి పది వేల ఎకరాలు ఉంటుంది. మూడు ఎకరాల్లో భూముల ధరలు కూడా రెట్టింపయ్యే అవకాశాలున్నాయన్న అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సంపద పెరుగుతుందని, తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
ఆదాయం పెరుగుతుందని...
ఇక అమరావతిలో నిర్మాణాలు ప్రభుత్వం ప్రారంభిస్తే ప్రయివేటు నిర్మాణాలు కూడా ఆరంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదేళ్లు క్రితం వేసిన వెంచర్లను బిల్డర్లు ఖాళీగా ఉంచారు. వాటిని కూడా సత్వరం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే అమరావతి మరింత సొబగులు అద్దుకుంటోంది. అంతే కాదు ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. అందుకే చంద్రబాబు తొలి ప్రాధాన్యతగా అమరావతిని ఎంచుకున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో రాజధాని నిర్మాణపనులను ప్రారంభిస్తే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం పదిహేను వేలకోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలెప్మెంట్ బ్యాంకు అంగీకరించడంతో ఇక పనులు అత్యంత వేగంగా జరగనున్నాయి.
Next Story