Fri Nov 22 2024 18:22:06 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే వైఎస్ జగన్ పై కేసు.. ఆ విషయం గుర్తు పెట్టుకోండి
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏ3గా పోలీసులు చేర్చారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. కస్టడీలో తనను హింసించారని... తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని రఘురామ ఫిర్యాదులో తెలిపారు.
ఈ పరిణామాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తాజాగా స్పందించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసుయంత్రాంగం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. రెడ్‌బుక్ అమలు చేయడంలో భాగంగానే జగన్‌తో పాటు ఇద్దరు ఐపీఎస్, మరో ఇద్దరు అధికారులపై నమోదు చేశారని ఆరోపించారు. 2021లో అప్పటి ఎంపీ రఘురామరాజుపై వైసీపీ ప్రభుత్వం చట్టపరంగా కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ (TDP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జగన్‌పై కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్‌తో మిలాఖతై అధికారులకు ఆదేశాలు జారీ చేసి జగన్‌పై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కాలం గిర్రున మళ్లీ తిరిగి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
Next Story