Wed Dec 25 2024 02:55:37 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు దొంగ అయినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు: అంబటి
చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకోడని..
చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకోడని.. హీరో అనే అంటాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకు వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిదని విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నాక కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు, దత్త రాక్షసులని అన్నారు. చంద్రబాబు నిప్పో తుప్పో నాకన్నా మీకే బాగా తెలుసంటూ విలేకరులతో చెప్పుకొచ్చారు. వార్తలు చూస్తున్న జనాలకు చంద్రబాబు నాయుడు గురించి ఇంకా బాగా తెలుసని అన్నారు.
మంత్రి అంబటి నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పలు సూచనలు చేసేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఈసారి ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంట వేయొద్దని సూచించారు. నాగార్జున సాగర్ నీటిపై ఆధారపడిన భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవడం తప్ప శరణ్యం లేదని అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ఓ మీడియా సంస్థ ప్రతినిధి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మంత్రి అంబటి స్పందిస్తూ.. ప్రస్తుతం రైతులు నష్టపోకుండా ముందస్తుగా హెచ్చరించేందుకే ఈ సమావేశం పెట్టామని చెప్పారు. రాజకీయాల గురించి మరోమారు మాట్లాడుకుందామని అంటూనే చంద్రబాబు నిప్పో తుప్పో మీకు తెలుసు, చూసే ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
Next Story