Mon Dec 23 2024 05:38:17 GMT+0000 (Coordinated Universal Time)
ధర్మం మీరే చెప్పాలి చిరంజీవి: అంబటి
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలిన పాత్రను చిత్రించడంపై వివాదం మొదలైంది.
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాల్సింది అన్నయ్య అంటూ చెప్పుకొచ్చారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారో లేదో చిరంజీవి చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడతానని అంబటి రాంబాబు అన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ్ముడికి చెబితే బాగుంటుందని ఆయన అన్నారు. మంత్రి రాంబాబు క్యారెక్టర్ సృష్టించింది ఎవరు అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆ పాత్ర రాంబాబుదేనని చెప్పే ధైర్యం కూడా లేదని అన్నారు.
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలిన పాత్రను చిత్రించడంపై వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో పవన్ సినిమా రెమ్యునరేషన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇటీవల అంబటి ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్ గురించి కాకుండా ప్రజలకు మంచి చేయడంపై ఆలోచించాలి అని అన్నారు. 'మీలాంటివాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగ- ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి' అని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
Next Story