Mon Dec 23 2024 05:53:11 GMT+0000 (Coordinated Universal Time)
శునకానందం పొందొద్దని చెప్పమ్మా రేణు: అంబటి రాంబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది తప్పేనని.. అయితే పొలిటికల్ గా ఆయనకు సపోర్ట్ చేస్తానని అన్నారు. తాజాగా ఈ వీడియో పై అంబటి రాంబాబు స్పందించాడు. రేణుకు అంబటి చిన్న రిక్వెస్ట్ చేసుకున్నారు. “అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
రేణు దేశాయ్ తాజా వీడియోలో.. ఓ తల్లిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. పిల్లలను దయచేసి ఇందులోకి లాగకండని కోరారు. మీరు మీరు ఏదైనా ఉంటే చూసుకోండి కానీ.. దయచేసి మా పిల్లలను రాజకీయాల్లోకి లాగకండి అని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోండి కానీ పిల్లల విషయాన్ని లాగకండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఆయన నా విషయంలో చేసింది ముమ్మాటికీ తప్పే.. అయితే పిల్లలను రాజకీయాల్లోకి లాగకండని అన్నారు. ఆయన ప్రజలకు సేవ చేయాలని అనుకునే వ్యక్తి అని.. ఆ విషయంలో తన సపోర్ట్ మాత్రం ఎప్పుడూ ఉంటుందని రేణు దేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. ఒక సిటిజన్ గా మాత్రం తాను పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటానని చెప్పుకొచ్చారు. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండన్నారు.
Next Story