Thu Dec 19 2024 09:54:18 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : పవన్ కు మళ్లీ గాజు గ్లాసు ఎందుకు?
ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసి తమను బద్నాం చేయడానికి ప్రయత్నించారని అంబటి రాంబాబు అన్నారు
ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఫిర్యాదు చేసి తమను బద్నాం చేయడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన కు మళ్లీ గాజు గ్లాసు సింబల్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా చివరకు గెలిచేది వైసీపీయేనని తెలిపారు. పవన్ కల్యాణ్ టీడీపీ సింబల్ పై పోటీ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. తాము ఎవరినీ కలుపుకుని వెళ్లమని ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు.
అభ్యర్థుల మార్పు గురించి...
తమ పార్టీ అభ్యర్థుల మార్పు గురించి చంద్రబాబు ఎందుకంత బాధ అని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారి హామీలను కూడా ప్రజలు పట్టించుకోరన్నారు. వారు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలకు తెలుసునని అన్నారు. జనం చంద్రబాబును నమ్మే రోజులు పోయాయని అన్నారు. పేదలు జగన్ పక్షాన నిలుస్తారని అంబటి రాంబాబు చెప్పారు. పవన్, చంద్రబాబులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇక గెలిచే అవకాశాలు లేవని ఆయన అన్నారు.
Next Story