Mon Dec 23 2024 13:45:36 GMT+0000 (Coordinated Universal Time)
Ambati : ప్రజలు తరిమి తరిమి కొడతారు పవన్
ముగ్గురూ కలసినా గెలవలేరని భావించి జగన్ పై హత్యాప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ముగ్గురూ కలసినా గెలవలేరని భావించి జగన్ పై హత్యాప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో కుట్రప్రకారమే దాడి జరిగిందన్నారు. జగన్ ను అధికారం నుంచి దించేయాలనే కుట్ర జరిగిందన్నారు. పవన్ కల్యాణ్ ను ప్రజలు క్షమించరని అంబటి రాంబాబు అన్నారు. అధికారం రాదని తెలిసి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారన్న అంబటి రాంబాబు చంద్రబాబు ఎంతటి పనికైనా తెగిస్తారన్నారు.
సానుభూతి లేకుండా...
జగన్ పై రాయి దాడి జరిగితే దానిని హాస్యాస్పదంగా మాట్లాడి పవన్ కల్యాణ్ మరింత చులకన అయ్యాడన్నారు. ప్రజల మద్దతు జగన్ కు ఉందని తెలిసిన తర్వాత ఆయనను హతమార్చడానికి కుట్రలు జరుగుతాయని ఊహించిందేనని అన్నారు. ఈ దాడి ఘటనలో జగన్ తృటిలో తప్పించుకున్నారని, ఏ మాత్రం రాయి కణితి భాగంలో తగిలితే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని అన్నారు. కనీసం సానుభూతి లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ లను ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు అంబటి రాంబాబు.
Next Story