Mon Nov 18 2024 00:49:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో ఇంటి నిర్మాణాలకు అనుమతులను మరింత సులభతరం చేస్తూ సవరణలకు ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్లో ఇంటి నిర్మాణాలకు అనుమతులను మరింత సులభతరం చేస్తూ సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. బిల్డింగ్ ప్లాన్ అనుమతుల్లో సవరణలకు ప్రభుత్వం ఆమోదించినట్లు ఆయన చెప్పారు. నాలుగు దశల్లో మార్పులు ఉంటాయని, రోడ్డు తక్కువ వెడల్పు ఉణ్నా అక్కడి విస్తీర్ణం రీత్యా భవన నిర్మాణానికి అనుమతి లభిస్తుందని తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
నిబంధనలను సడలించి...
ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు 30 అడుగులు ఉంటేనే భవన నిర్మాణానికి అనుమతి లభిస్తుందన్నారు. అంతకంటే తక్కువ ఉంటే అనుమతులు రావని అన్నారు. అయితే తాజాగా సడలించిన నిబంధనల మేరకు అక్కడ రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నా భవన యజమానులు రోడ్డుకు తగినంత స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. తక్కువ స్థలంలో కూడా ఇళ్లను నిర్మించుకునే వీలు ఇప్పుడు కలుగుతుందన్నారు. దీనివల్ల బ్యాంకు రుణాలు కూడా వస్తాయని చెప్పారు.
Next Story