Tue Mar 18 2025 00:31:47 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో టెన్షన్.. పెద్దారెడ్డి రావడంతో?
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత ఇంటికి వచ్చారు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన సొంత ఇంటికి వచ్చారు. దీంతె టీడీసీ కార్యకర్తలు పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. కీలక డాక్యుమెంట్లు నివాసంలో ఉండటంతో వాటిని తీసుకెళ్లేందుకు వచ్చానని పెద్దారెడ్డి చెబుతున్నారు.
ఇరువర్గాలు...
టీడీపీ వర్గీయుల ముట్టడి ప్రయత్నాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రాళ్ల దాడిలో కొందరికి స్వల్ప గాయాలయినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిని వదలి వేరే చోట ఉంటున్నారు. ఆయన రావడంతో టెన్షన్ మొదలయింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story