Sun Dec 22 2024 16:20:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : చట్నీస్ అధినేత కుటుంబంతో షర్మిలమ్మ వియ్యం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో త్వరలోనే ఒక శుభకార్యం జరగబోతుంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో త్వరలోనే ఒక శుభకార్యం జరగబోతుంది. జగన్ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియకు త్వరలో వివాహమన్న వార్త వైరల్ గా మారింది. రెండు రాష్ట్రాలకు చెందిన వైఎస్ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇద్దరూ నాలుగేళ్లుగా అమెరికాలోనే ఉంటూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతుండటంతో పెద్దల అంగీకారంతో ఈ వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ ప్రేమించుకుని...
షర్మిల కుమారుడు రాజారెడ్డితో చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు ప్రియ అట్లూరి. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో ఇద్దరూ త్వరలోనే ఒకటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పరస్పరం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒకటయితే... ఇద్దరు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడానికి నిర్ణయించడం మరో విశేషంగా సోషల్ మీడియాలో వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
Next Story