Sun Dec 22 2024 23:28:57 GMT+0000 (Coordinated Universal Time)
Cm Ramesh : సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు.. సీబీఐ, ఈడీలు వస్తున్నాయ్
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేయడంపై సీఎం రమేష్ స్పందించారు. ఈ ఈడీ సోదాలు ఆరంభం మాత్రమేనని సీఎం రమేష్ అన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును కక్కిస్తామని ఆయన తెలిపారు. దోచుకున్న సొమ్ము మొత్తాన్ని కక్కించి ప్రజల కోసం పంచడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన వివరించారు.
అక్రమ సంపాదనలపై...
వైసీపీ నేతల అక్రమ సంపాదనలపై సీబీఐ, ఈడీలకు తానే ఫిర్యాదు చేసినట్లు ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. త్వరలో జగన్ తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకుని వేల కోట్ల రూపాయలను సంపాదించారన్నారు. ఐదేళ్లు వారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్న ఆయన విశాఖలో అనేక ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్నారని ఆరపించారు. తప్పు చేసిన వాళ్లు సరెండర్ కావాలని వార్నింగ్ ఇచ్చారు.
Next Story