Mon Dec 23 2024 08:42:16 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం డీఐజీపై వేటు
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వరసగా పోలీసు అధికారులపై బదిలీ వేటు వేస్తుంది. తాజగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది తక్షణమే విధుల నుంచి వైదొలగాలని కోరింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అమ్మిరెడ్డిపై అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. దీంతోనే అన్ని రకాలుగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వరసగా వేటు వేస్తూ...
ఇటీవలే రాష్ట్ర డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిని బదిలీచేసిన ప్రభుత్వం ఇప్పుడు అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు అప్పగించవద్దని సూచించింది. ఇటీవల అన్పురాజన్ ను బదిలీ చేసింది. ఆయన సతానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. అలాగే అనంతపురం అర్బన్ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story