Sun Dec 22 2024 22:36:24 GMT+0000 (Coordinated Universal Time)
పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన పది రూపాయల నాణేలు వ్యాపారులు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ తెలిపారు
భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన నాణేలు వ్యాపారులు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చెలామణిలో ఉన్న నాణేలను స్వీకరించేందుకు విముఖత చూపరాదని జిల్లా కలెక్టర్ వ్యాపారులను కోరారు. చెలామణిలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాణేలు విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటాయని, ప్రస్తుతం రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, మరియు పది రూపాయల నాణేలను స్వీకరించడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విముఖత చూపితే...
కొందరు వ్యాపారులు, దుకాణదారులు, ప్రజల నుంచి నాణేలను స్వీకరించేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం ఉందని, వ్యాపారులు, దుకాణదారులు నాణేలను అందరూ తీసుకోవాలన్నారు. నాణేలను తీసుకోకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నాణేలను తీసుకోకూడదనే నమ్మవద్దని కలెక్టర్ కోరారు. ఈ నాణేలను అన్ని బ్యాంకు శాఖలలో మార్పిడి చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరిలో ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
Next Story