Sun Dec 14 2025 18:14:51 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : యాంకర్ శ్యామలకు అసభ్య మెసేజ్ లు.. ఏం వచ్చాయో తెలిస్తే?
యాంకర్ శ్యామల తనకు టీడీపీ కార్యకర్తలు అసభ్య సందేశాలను పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

యాంకర్ శ్యామల తనకు టీడీపీ కార్యకర్తలు అసభ్య సందేశాలను పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా? అని ఆమె ప్రశ్నించారు. తనకు వచ్చిన అసభ్య మెసేజ్లను మీడియాకు చూపించారు. తన వాట్సప్ నెంబరుకు పంపిన మెసేజ్లతో పాటు ఛాట్ లు కూడా ఆమె మీడియా ప్రతనిధులకు చూపారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా...
తాను వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నానని, తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆమె అన్నారు. తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయం ఫిర్యాదు చేస్తానని యాంకర్ శ్యామల తెలిపారు. ఎవరెన్ని మెసేజ్ లు చేసినా తన వాయిస్ మాత్రం మారదని శ్యామల తెలిపారు.
Next Story

