Thu Dec 19 2024 09:34:40 GMT+0000 (Coordinated Universal Time)
ఎదురుగా పోలీసులు ఉన్నా.. కంట్రోల్ చేసుకోలేకపోయిన మందుబాబులు
50 లక్షల విలువైన 24,031 మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు
గుంటూరు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో పట్టుబడిన కల్తీ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా మద్యం ప్రియులు మద్యం బాటిళ్లను తీసుకోడానికి పరుగులు తీశారు. అధికారుల కళ్ల ముందే ఈ ఘటన జరిగింది. వివిధ కేసుల్లో జప్తు చేసిన రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేసే పనిలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు అక్కడే ఉన్నప్పటికీ మందుబాబులు మద్యాన్ని తీసుకుని వెళ్లిపోయారు.
నల్లచెరువులోని డంపింగ్ యార్డులో రూ.50 లక్షల విలువైన 24,031 మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పొక్లెయినర్ సహాయంతో సీసాలను పగలగొట్టడానికి ప్రయత్నించారు. అందుకు కాస్త సమయం పట్టింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. మద్యం సీసాలను నేలపై పెట్టగానే గుంపులుగా వచ్చిన వ్యక్తులు చేతికందిన మద్యం సీసాలను పట్టుకుని పారిపోయారు. పోలీసులు ఆగండి.. ఆగండి అంటున్నా కూడా వినకుండా మందుబాబులు మద్యం సీసాలను పట్టుకుని పరిగెత్తారు.
Next Story