Mon Dec 23 2024 18:52:36 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సు నడిపిన మంత్రి సవిత
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆర్టీసీ బస్సును నడిపి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తారు
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆర్టీసీ బస్సును నడిపి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తారు. శ్రీ సత్యజిల్లా పెనుకొండ ఆర్టీసీ డిపోకు రెండు కొత్తగా ఆర్టీసీ బస్సులు మంజూరయ్యాయి. వీటి ప్రారంభోత్సవానికి మంత్రి సవిత హారయ్యారు. ఈ సందర్భంగా రెండు సర్వీసులను ఆమె ప్రారంభించారు. అయితే ఈ బస్సుల్లో ఒకదానిని నడిపి అందరినీ ఆశ్యర్యంలో ముంచత్తారు.
స్టీరింగ్ పట్టుకుని...
మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ స్వయంగా చేయడంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్య పోయాయి. అందరికీ సుఖవంతమైన ప్రయాణం అందించాలన్న లక్ష్యంతోనే ఆర్టీసీ బస్సుల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని కోరారు. అప్పుడే ఆర్టీసీ లాభాల బాటల్లో పయనిస్తుందని తెలిపారు. మరిన్ని సర్వీసులు గ్రామీణ ప్రాంతాలకు రావడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
Next Story