Mon Dec 23 2024 12:50:24 GMT+0000 (Coordinated Universal Time)
19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. శాసనసభ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. శాసనసభ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక పూర్తయిన మరుసటి రోజు నుంచి శాసనసభ సమావేశాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కీలక బిల్లులకు...
ఈ నెల 23వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. పాటు పది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపాలని నిర్ణయించారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న బీఏసీ సమావేశంలో శాసనసభ పనిదినాలపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సంక్షేమ పథకాలపై చర్చించచనున్నారు.
Next Story