Mon Dec 23 2024 09:49:51 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు
మార్చి 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి
మార్చి 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయిస్తారు. అయితే పది పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈసారి 2.30 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తుంది.
కీలక బిల్లులు....
దీంతో పాటు ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో మూడు రాజధానుల కొత్త బిల్లును కూడా ఈ సమావేశాల ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కీలక బిల్లులను ఆమోదించుకోవడంతో పాటు బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.
Next Story