Mon Dec 15 2025 04:13:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభపక్ష నేత ఎంపిక
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల సమావేశం నేడు విజయవాడలో జరగనుంది

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల సమావేశం నేడు విజయవాడలో జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికయిన వారిలో ఒకరిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు.
ఇద్దరిలో ఒకరు...
ఇందులో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశముంది. అయితే ఇద్దరూ మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరిని ఎన్నుకోవాలన్నది శాసనసభ్యులు నిర్ణయించుకుంటారు.
Next Story

