Mon Dec 23 2024 13:11:42 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పై సోము ఫైర్
వైసీపీ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు.
వైసీపీ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గత కొన్ని నెలలగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా లక్షా నలభై వేల రేషన్ కార్డులు ఇచ్చారని, అందులో అత్యధిక శాతం మందికి అసలు బియ్యం అవసరం లేదని తెలిపారు.
రీసైక్లింగ్ చేసి....
పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా కొనసాగుతుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతర దేశాలకు తరలించి వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో పెద్దయెత్తున బియ్యం కుంభకోణం జరుగుతుందని తెలిపారు. అందరి బాగోతాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.
Next Story