Wed Jan 15 2025 11:24:36 GMT+0000 (Coordinated Universal Time)
హుటాహుటిన ఢిల్లీకి సోము
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి అత్యవసరంగా పిలుపు వచ్చింది
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి అత్యవసరంగా పిలుపు వచ్చింది. దీంతో బీజేపీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటీవల మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించి పలువురు నేతలను కలసి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి సోము వీర్రాజుకు పిలుపు వచ్చిందా? అన్న చర్చ జరుగుతుంది.
పొత్తులపైనేనా?
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరి పార్టీ పెద్దలందరినీ కలిశారు. దీంతో హుటాహుటిన సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు సోము ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై కూడా సోము వీర్రాజు అభిప్రాయాన్ని తీసుకునేందుకే పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.
Next Story