Tue Apr 01 2025 02:29:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల మృతిపై కేబినెట్ లో చర్చ
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరసగా సాక్షులు మరణించడంపై చర్చ జరిగింది

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరసగా సాక్షులు మరణించడంపై చర్చ జరిగింది. వివేకాహత్య కేసులో సాక్షి రంగన్న మృతి చెందడంపై డీజీపీని వివరణ కోరింది. వరసగా ఈ హత్య కేసులో సాక్షులు వరసగా మరణించడంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. అసలు సాక్షులు ఎందుకు వరసగా మరణిస్తున్నారన్న దానిపై విచారణ చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది.
అత్యున్నత స్థాయి విచారణ...
ఈ మేరకు డీజీపీని అత్యున్నత స్థాయిలో విచారణ చేయాలని కేబినెట్ సమావేశం కోరింది. సాక్షులు మరణించడం యాథృచ్ఛికంగా జరిగిందా? లేక ఇందులో మరైదైనా కోణం ఉందా? అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీని కేబినెట్ కమిటీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాటు కేబినెట్ లోకి వచ్చిన పథ్నాలుగు అంశాలను మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది.
Next Story