Mon Dec 23 2024 14:54:21 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నవంబరు 6న కేబినెట్ భేటీకి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. నవంబరు 6వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. నవంబరు 6వ తేదీన ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదం లభించనుంది.
కీలక నిర్ణయాలు...
దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశముంది. మహిళలకు ఉచితబస్సు ప్రయాణంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుపై చర్చను చేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు అమరావతి రాజధాని, పోలవరం విషయంలో కూడా కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకునే అవకాశముందని తెలిసింది.
Next Story