Mon Dec 23 2024 09:32:27 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరిగే అవకాశాలున్నాయని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలను ఆమోదించాల్సిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 18న కేబినెట్ భేటీ జరపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
19 నుంచి అసెంబ్లీ సమావేశాలు...
ీదీంతో పాటు అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల 19వ తేదీ నుంచి జరుగుతాయని చెబుతున్నారు. వాస్తవానికి 17వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు జరిపి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పెట్టాలని తొలుత భావించినా ఆరోజు బక్రీద్ కావడంతో దానిని 19వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం మరుసటి రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టేలా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇదే తెలుస్తోంది.
Next Story