Thu Dec 26 2024 01:00:38 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన కేబినెట్ భేటీ.... రాజీనామా చేసిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు ఆమోదం తెలిపింది. కొత్త పేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదహరు అంశాలకు చివరి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
పార్టీ బాధ్యతలను...
కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులందరూ తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి కి నేరుగా సమర్పించినట్లు తెలిసింది. కేబినెట్ సమావేశానికి వచ్చే ముందే మంత్రులు తమ రాజీనామా లేఖలను తయారు చేసుకుని వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ప్రస్తుత మంత్రులకు జగన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
Next Story