Sun Dec 22 2024 02:33:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ ఫ్రా ట్రాన్స్ పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని కేబినెట్ సమావేశం ప్రతిపాదించింది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సభరణ బిల్లుకు కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
రెండేళ్లకు కుదిస్తూ...
అవిశ్వాసం గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు క్రీడా పాలసీకి కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. కర్ణూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది.
Next Story