Thu Dec 19 2024 13:02:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కేబినెట్ వాయిదా.. ఈ నెల 7వ తేదీన
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుందని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు వివిధ శాఖల నుంచి కేబినెట్ లో చర్చించాల్సిన అజెండాను కూడిసిద్ధం చేయాలని ఆదేశించారు.అయితే కేబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
2వ తేదీన జరగాల్సి ఉండగా...
ఈ నెల 2వతేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం 7వ తేదీన జరుగుతుందని నూతనంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
Next Story