Tue Dec 24 2024 17:54:41 GMT+0000 (Coordinated Universal Time)
Ap Cabinet : నిరుద్యోగులకు గుడ్న్యూస్ ..కేబినెట్ లో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త కేబినెట్ సమావేశం ద్వారా చెప్పనున్నారు. ఈ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చ జరిగింది. డీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
డీఎస్సీ నోటిఫికేషన్ ను...
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ను విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. కాగా మంత్రి వర్గ సమావేశానికి మంత్రి గుమ్మనూ రిజయరాం కూడా హాజరయ్యారు. ఆయన కొంత కాలంగా పార్టీకి, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జయరాం ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం లేదని స్పష్టమయిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయ.
Next Story