Mon Dec 23 2024 13:20:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..పిఠాపురం వాసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పిఠాపురం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీకి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పిఠాపురం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ అధారిటీ ఏర్పాటునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత మంత్రి వర్గ సమావేశం ప్రారంభం అయింది.
అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ...
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Next Story