Mon Dec 23 2024 12:35:23 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్.. వారి పదవీ విరమణ వయసు పెంచుతూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జ్యుడిషియల్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యాభై ఎనిమిదేళ్ల నుంచి 61 పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పిఠాపురం అర్బన్ డెవలెప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సీఆర్డీఏ పరిధిని పెంచుతూ...
దీంతో పాటు ప్రస్తుతం ఉన్న సీఆర్డీఏ పరిధిని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. సీఆర్టీఏ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలను చేరుస్తూ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నామినేషన్ పదవుల విషయంలో 34 శాతం రిజర్వేషన్ అమలు చేసే అంశానికి కూడా ఆమోదం తెలుపుతూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అందరూ విధిగా హాజరుకావాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.
Next Story