Mon Dec 23 2024 15:28:33 GMT+0000 (Coordinated Universal Time)
29న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలను వెంటనే పంపాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా మూడు రాజధానుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని సమచారం.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై....
ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. వర్షాకాల సమావేశాలను జరపాలని ప్రభుత్వం అంతకు ముందు నిర్ణయించినా వరదల కారణంగా నిర్వహించలేకపోయింది. దీతో ఈ సమావేశాలతో పాటు ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Next Story