Mon Dec 23 2024 14:05:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు2న ఏపీ కేబినెట్ భేటీ
ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
వివిధ అంశాలపై...
సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూ అక్రమాల పై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన అంశాలపై కూడా చర్చించే అవకాశముంది.
Next Story