Mon Dec 23 2024 12:04:27 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కేబినెట్ ఆమోదించనుంది.
సూపర్ సిక్స్ హామీలు...
దీంతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో కొన్ని బిల్లుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే కొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆర్థిక అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.
Next Story