Mon Dec 23 2024 13:00:57 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు దిశగా?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులను ఆమోదించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పలు కీలక బిల్లులకు ....
ఈ సమావేశంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్ణయాలకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అనేక బిల్లులకు సంబంధించి ఆమోదం ఈ సమావేశంలో తెలపనుంది. రాజధాని అమరావతిలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనుల టెండర్లు రద్దు చేసే అవకాశముంది. కొత్తగా టెండర్లను పిలిచే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story