Mon Dec 15 2025 02:06:28 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు కేబినెట్ భేటీకి ఆ మంత్రి హాజరవుతారా? డౌటేనట
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. అయితే ఒక మంత్రి ఈ సమావేశానికి హాజరు కావడం అనుమానంగా ఉంది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరగనున్న ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సిన తేదీలను కూడా నిర్ణయించే అవకాశముంది. అయితే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ సమావేశానికి ఒక మంత్రి హాజరు కావడంపై అనుమానంగా ఉంది. ఆయన సమావేశానికి వస్తారా? లేదా? అన్న దానిపై ఇప్పటికే అధికార వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం.
ప్లేస్ మార్చడంతో...
మంత్రి వర్గ సమావేశానికి ఖచ్చితంగా మంత్రులందరూ హాజరు కావాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి కోరే వీలున్నా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా మంత్రి ఒకరు సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయనే మంత్రి గుమ్మనూరి జయరాం. గుమ్మనూరి జయరాం గత కొద్ది రోజులుగా పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఈ సమావేశానికి రాకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఆయన సమావేశానికి హాజరయ్యే అవకాశాలు తక్కువ.
అందుబాటులో లేక...
గుమ్మనూరి జయరాంను ఆలూరు శాసననసభ నియోజకవర్గం నుంచి మార్చి కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో నేతలను కలసి తనకు మరోసారి ఆలూరులో పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని కోరినా ఫలితం లేదు. దీంతో ఆయన గత కొద్ది రోజులు నుంచి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం అనుమానంగానే ఉందని పార్టీ నేతలు సయితం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story

