Mon Dec 23 2024 19:48:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొన్ని కీలకాంశాలపై చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు వాలంటీర్ల వ్యవస్థ విషయంపై కూడా చర్చించనున్నారు.
ఈ కేబినెట్...
దీంతో పాటు ఈ సమావేశం ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. పేపర్ లెస్ విధానంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్పుడు ఈ కేబినెట్ నిర్వహించారు. తిరిగి ఈరోజు ఈ కేబినెట్ జరగనుంది. ఇప్పటికే మంత్రులందరీకీ ట్యాబ్ లు అందచేశారు. మంత్రి వర్గ సమావేశంలో చర్చించే విషయాలు బయటకు పోకుండా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
Next Story