Mon Dec 23 2024 16:40:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh: మంత్రుల గ్రాఫ్ ఏంటో తెలిసేది నేడే.. నేడు కేబినెట్ భేటీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్తన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. నూతన మద్యం విధానానికి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలుపై చర్చ జరిగిన తర్వాత మద్యం పాలసీపై ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది.
మంత్రుల గ్రాఫ్ పై....
దీంతో ఇటీవల వరదలు, నష్టంపై మంత్రివర్గం చర్చించనుందని తెలిసింది. కేంద్రం సహాయం పైనా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపైనా కేంద్ర కేబినెట్లో చర్చిస్తారు. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇవ్వనున్నారు.
Next Story