Mon Dec 23 2024 02:58:45 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నాడు హైటెక్ సిటీని నేనే నిర్మించా.. ఇప్పుడు అదే తెలంగాణకు
ఒకప్పుడు హైటెక్ సిటీని తానే నిర్మించానని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్నారు
ఒకప్పుడు హైటెక్ సిటీని తానే నిర్మించానని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్నారు. సెల్ ఫోన్ రావడం వెనక కూడా తన ఆలోచన ఉందని చెప్పారు. విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ ఎప్పటికిప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితేనే మనం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించగలమని అన్నారు. రానున్నది డ్రోన్ల కాలమని తెలిపారు. డ్రోన్లు గేమ్ ఛేంజర్లుగా మారనున్నాయని చంద్రబాుబ తెలిపారు. భారత్ టెక్నాలజీలో దూసుకుపోతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో డ్రోన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళతామని తెలిపారు.
డోన్లు గేమ్ ఛేంజర్..
ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లోనూ డ్రోన్లతో బాధితులకు ఆహారాన్ని అందించగలిగామని చంద్రబాబు తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయబట్టే నేడు సాంకేతికంగా అన్ని రంగాల్లో భారత్ ముందుకు వెళుతుందన్నారు. ఐటీ నిపుణుల్లో ముప్ఫయి శాతం మంది తెలుగు వారే ఉండటం గర్వకారమని ఆయన తెలిపారు. అన్ని రకాలుగా డ్రోన్లను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. విద్యుత్తు, చెత్త నిల్వల గుర్తింపు, సాగు నీటి కాల్వల నిర్వహణ వంటి వాటివి డ్రోన్లతో పరిశీలించి తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు కూడా డ్రోన్లను వినియోగించవచ్చని తెలిపారు. తక్కువ ఖర్చుతో డ్రోన్లు లభ్యమయ్యేలా చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టర్మ మీద ఉందన్న ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం అంటూ తన ప్రసంగించాన్ని ముగించారు.
Next Story