Sun Dec 22 2024 18:38:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు కీలక నిర్ణయం.. సంక్రాంతి నుంచి ప్రజలతో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి ప్రజలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. వారి అభిప్రాయాలను నేరుగా చంద్రబాబు తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పనులపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రజలతో ముఖాముఖి...
సంక్రాంతి పండగ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ప్రజలతో వివిధ అంశాలపై ప్రజలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆడియో లేదా వీడియో విధానంలో నిర్వహించాలన్న దానిపై ఇంకా నిర్ణయం కాలేదు. 1995 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు డయల్ యువర్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే తరహాలో మళ్లీ ప్రజలకు చేరువయ్యేలా అలంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
Next Story