Mon Dec 23 2024 02:18:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh: చంద్రబాబు కీలక భేటీ.. వారిపై వేటు తప్పదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులను బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన టీం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకునే క్రమంలో భాగంగానే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో....
గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన కొందరు అధికారులను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. కొందరు అధికారులు గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో వారిని తప్పించి తనకు అనుకూలురైన ఐఏఎస్, ఐపీఎస్ లను చంద్రబాబు నియమించుకునే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
Next Story