Mon Dec 23 2024 20:16:05 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అదిరిపోయే న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గృహనిర్మాణ శాఖపై ఆయన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వందరోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఇకపై కొత్తగా ఎంపిక చేసిన లబ్దిదారులకు గ్రామీణ ప్రాంతల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యతరగతి ప్రజల కోసం ఎంఐజీ లే అవుట్ లను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సమీక్షలో తెలిపారు.
అర్హులైన వారందరికీ...
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్మమని చంద్రబాబు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే కొంత భరించేలా నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులకు కూడా తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించి ఇవ్వలని గృహనిర్మాణ శాఖ సమీక్షలో నిర్ణయించారు. 2047 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story