Sat Dec 21 2024 01:52:36 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. వర్ష ప్రభావం తగ్గినా చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
సహాయక చర్యలను...
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధితుల వద్దకు సహాయక బృందాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే వాగులు, వంకల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వరద నీరు తగ్గేంత వరకూ వాహనాల రాకపోకలను నిలిపేయాలని తెలిపారు. వర్షం తగ్గినప్పటికీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. నష్టం అంచనాలను త్వరలోనే నివేదిక రూపంలో అందించాలని కోరారు.
Next Story