Mon Dec 23 2024 11:35:44 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. తల్లిని, చెల్లిని కూడా అంటూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తల్లి, చెల్లికి ఆస్తులు పంచకుండా, కోర్టుకు ఎక్కి వారిపై కక్ష సాధింపులు చేస్తున్నారని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా వారిద్దరినీ రోడ్డుపైకి జగన్ లాగారని చంద్రబాబు అన్నారు. అలాంటి జగన్ తమ గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. తండ్రి సంపాదించిన ఆస్తి భార్యకు, చెల్లికి రాదా? అని అన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా?
మమ్మల్ని తిడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఆస్తులు పంచడానికి కండిషన్ లు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తల్లికి, చెల్లి విషయంలో ఈ షరతులేంటంటూ చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి వ్యక్తితో రాజకీయాలు చేయాలంటే నిజంగానే సిగ్గనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. వైసీపీలో ఉండేందుకు కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ దాచి పెట్టిన చీకటి జీవోలపై విచారణ జరుపుతామని చంద్రబాబు అన్నారు.
Next Story