Sun Dec 22 2024 23:35:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Naidu : వరద బాధితులకు చంద్రబాబు చెప్పిన తాజా గుడ్ న్యూస్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత నెలలో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారిలో అర్హులందరికీ పరిహారం అందాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో సమీక్ష చేసిన చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో ఎక్కువ వరదలు సంభవించి విజయవాడ నగరంలో ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పటికే దాదాపు 618 కోట్ల రూపాయల పరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేశారు.
ఈరోజు వారి అకౌంట్లలో...
అయితే ఇంకా తమకు వరద సాయం అందలేదని కొందరు ఆందోళన చేస్తున్నారు. కొందరు తమకు వరద సాయం అందించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వాస్తవంగా వరదల్లో నష్టపోయిన వారందరికీ పరిహారం అందచేయాలని అధికారులను కోరారు. ఈరోజు అర్హులైన వారందరికీ పరిహారం అందచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూడాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story