Fri Dec 27 2024 12:08:41 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. టీచర్ల కొరత ఉంటే విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టులు ఖాళీగా ఉన్న చోట చదువు నాణ్యత దెబ్బతినకుండా విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు.
ఏదో ఒక స్కూలులో...
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కూల్లో ఉండేలా చూడాలని, ఆ తర్వాత వారిని ప్రభుత్వ బడిలోకి తీసుకురావడంపై ఆలోచించ వచ్చని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలన్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
Next Story