Mon Dec 23 2024 16:49:08 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu :మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఏడాదికి 2,684 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి ఈ హామీని దీపావళి రోజు నుంచి ప్రతి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేయనుందని చంద్రబాబు ప్రకటించారు.
ఏడాదికి మూడు...
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చేసిన ప్రకటనను దీపావళి రోజున అమలు చేయనున్నారు. దీపం పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అధికారిక ప్రకటన వెలువడినట్లేనని అనుకోవాలి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం ఒక ముందడుగు అన్నారు. గతంలో ఈ పథకం ద్వారానే పేదలకు గ్యాస్ కనెక్షన్లను అందచేశామన్నారు. మహిళ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.
Next Story