Mon Dec 23 2024 23:14:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్.. ఐదు లక్షల రూపాయల వరకూ
దసరా పండగ నాడు చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు
దసరా పండగ నాడు చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డ్వాక్రా సంఘాలు అంటేనే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. డ్వాక్ర గ్రూపుల ద్వారా మహిళల్లో స్వయం ఉపాధి శక్తిని పెంచి, ఇంటికి యజమానిగా మహిళలను తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలోనే ఆయన డ్వాక్రా మహిళలకు శ్రీకారం చుట్టారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా డ్వాక్రా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం చంద్రబాబు నాయుడుకు అలవాటు.
డ్వాక్రా గ్రూపులకు...
ఎన్నికల ప్రచార సమయంలోనూ డ్వాక్రా గ్రూపులకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించారు కూడా. డ్వాక్రా గ్రూపులు శక్తిమంతమైతే రాష్ట్రం ఆర్థికంగా మరింత శక్తిమంతమవుతుందని నమ్ముతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో డ్వాక్రా మహిళలతో సమావేశమై వారితో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలే మహారాణులని, గ్రామీణ స్థాయిలో మహిళలు స్వయం ఉపాధి పొందడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన నిరంతరం చెబుతూ వస్తుంటారు.
ఐదు లక్షల వడ్డీ లేని రుణాలను...
ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందించాలని నిర్ణయించారు. దీనిపై డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సఘాలలోని ఎస్సీ మహిళలకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ రుణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రుణంలో రాయితీ కూడా ఉంది. యాభై వేల రూపాయల రాయితీ కూడా ప్రభుత్వం ఎస్సీ మహిళ గ్రూపు సభ్యులకు అందచేస్తుంది. రాయితీ పోను, మిగిలిన రుణంపై ఎటువంటి వడ్డీ ఉండదని అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారాలతో పాటు చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ సేవా రంగంలో ఉన్న వారికి ఈ రాయితీ రుణాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇరవై నాలుగు నుంచి అరవై నెలల్లో వాయిదా పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన పెట్టింది. రాయితీని చివరలో మినహాయిస్తారు.
Next Story