Fri Jan 10 2025 07:50:15 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ సీఎంకు చంద్రబాబు పోన్
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. రాజస్థాన్ లో విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందిజప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సిఎంతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని కోరారు. ప్రమాదంలో విజయవాడకు చెందిన ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జోత్స్న మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటనపై రాజస్థాన్ సిఎంతో మాట్లాడి ప్రమాద బాధితులకు మెరుగైన సాయం అందించాలని చంద్రబాబు కోరారు. న్యాయవాదులు తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కేంద్ర మంత్రులను కలుస్తూనే...
మరో వైపు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి - రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సాయంత్రానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రహోంమత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించనున్నారు.
Next Story